Centuries by Vaibhav and Aaron: మూడో వన్డేలో వైభవ్, అరోన్ సెంచరీల మోత
వైభవ్, అరోన్ సెంచరీల మోత
Centuries by Vaibhav and Aaron: సౌతాఫ్రికాలోని బెనోనీలో జరిగిన మూడో అండర్-19 వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జ్ ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు.ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.
వైభవ్ సూర్యవంశీ కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి.అరోన్ జార్జ్ 106 బంతుల్లో 118 పరుగులు చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు.
వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 25.3 ఓవర్లలోనే 227 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగుల భారీ స్కోరు సాధించింది.394 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు, భారత బౌలర్ల ధాటికి 160 పరుగులకే కుప్పకూలింది.భారత్ 233 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు.
ఈ సిరీస్‌లో వైభవ్ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు.రెండో వన్డేలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, అండర్-19 వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
మూడో వన్డేలోసెంచరీ చేయడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ,ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.
జనవరి 15 నుండి ప్రారంభం కానున్న అండర్-19 వరల్డ్ కప్ కు ముందు భారత యువ జట్టు ఇలాంటి ప్రదర్శన చేయడం నిజంగా గొప్ప విషయం.