Cricket Sensation: క్రికెట్‌లో సంచలనం.. 6 బాల్స్‌లో 6 వికెట్లు..

6 బాల్స్‌లో 6 వికెట్లు..;

Update: 2025-07-09 08:38 GMT

Cricket Sensation:  ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో లంకాషైర్ జట్టు ప్రత్యేక రికార్డును సృష్టించింది. అది కూడా 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టడం ద్వారా. కానీ విశేషమేమిటంటే ఇది రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఇది సాధించడం.. నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ 19 ఓవర్లలో 177 పరుగులు చేసింది. కానీ చివరి ఓవర్ చివరి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి సైఫ్ జైబ్‌ను జోస్ బట్లర్ రనౌట్ చేశాడు. సాకిబ్ మహమూద్ వేసిన 4వ బంతికి శాండర్సన్ (0) బౌల్డ్ అయ్యాడు. 5వ బంతికి లాయిడ్ పోప్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 6వ బంతికి స్క్రిమ్‌షా క్యాచ్ అవుట్ అయ్యాడు. సాకిబ్ మహమూద్ చేసిన ఈ హ్యాట్రిక్ తో, లంకాషైర్ జట్టు చివరి ఓవర్లో 4 వికెట్లు తీసి మెరిసింది.

దీని తర్వాత, లంకాషైర్ - డెర్బీషైర్ మరుసటి రోజు మరో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే ల్యూక్ వుడ్ కాలేబ్ జ్యువెల్ (0) వికెట్ తీసుకున్నాడు. రెండో బంతికే మార్టిన్ ఆండర్సన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లతో, లంకాషైర్ T20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో 6 బంతుల్లో 6 వికెట్లు తీసిన మొదటి జట్టుగా నిలిచింది. అంటే నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 4 వికెట్లు తీసిన లంకాషైర్, డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి రెండు బంతుల్లో 2 వికెట్లు తీసి ఈ ఘనతను సాధించింది.

లంకాషైర్ బౌలర్ల ప్రతిభ:

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ లంక షైర్ జట్టు ఘన విజయం సాధించింది. నార్తాంప్టన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని లాంక్షైర్ 19.3 ఓవర్లలోనే ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా, లంకాషైర్ డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.

లాంక్షైర్ ప్లేయింగ్ టీమ్: ఫిలిప్ సాల్ట్, కీటన్ జెన్నింగ్స్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, ల్యూక్ వెల్స్, ఆష్టన్ టర్నర్, మైఖేల్ జోన్స్, క్రిస్ గ్రీన్, జాక్ బ్లేథర్‌విక్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్

Tags:    

Similar News