Cricket: సిరాజ్ సిక్స్..407కే ఇంగ్లాండ్ ఆలౌట్

407కే ఇంగ్లాండ్ ఆలౌట్;

Update: 2025-07-05 15:53 GMT

Cricket: ఇంగ్లాండ్ తో జరుగుతోన్న సెకండ్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. జోరుమీదున్న ఇంగ్లాండ్ బ్యాటర్లను హైదరాబాద్ బౌలర్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్ 407 కే ఆలౌట్ అయ్యింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియాఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 28, కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఇండియా 587 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అతిథ్య జట్టు 407 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా 244 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

77 పరుగులకు మూడు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‎తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్..ఆ తర్వాత స్మిత్, బ్రూక్‌ ఇండియా బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. ఈ ఇద్దరు బ్యాటర్లు బజ్ బాల్ క్రికెట్ ఆడుతూ ఇండియా బౌలర్లను ఊచకోత కోశారు. ఇద్దరు భారీ సెంచరీలతో చెలరేగి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‎ను గట్టెక్కించారు. బ్రూక్ 158 పరుగులు, 184 పరుగులతో స్మిత్ అజేయంగా నిలవడంతో ఇంగ్లాండ్ 407 పరుగులు చేసి ఆలౌంట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో సిరాజ్ 6, ఆకాష్ దీప్ 4 వికెట్లు తీశారు.

Tags:    

Similar News