Aakash Chopra: డక్ వర్త్ లూయిస్ రూల్ కరెక్ట్ గా లేదు:ఆకాష్ చోప్రా,

రూల్ కరెక్ట్ గా లేదు:ఆకాష్ చోప్రా,

Update: 2025-10-21 05:57 GMT

Aakash Chopra: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా, డక్ వర్త్ లూయిస్ (DLS) సిద్ధాంతంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు, లక్ష్యాన్ని (టార్గెట్) నిర్ణయించే ఈ విధానం మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అన్యాయం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ vs ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ లో DLS పద్ధతి ప్రకారం టార్గెట్ చేధించే జట్టుకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని...మొదటి బ్యాటింగ్ చేసిన జట్టుకు వారి స్కోర్‌కు తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు, ఓవర్లు తగ్గడం గురించి తెలియకుండానే ఆడుతుంది, కానీ ఛేదించే జట్టుకు లక్ష్యం, ఓవర్లు ముందే తెలుస్తాయి. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోర్‌ను బట్టి, DLS ప్రకారం నిర్ణయించిన లక్ష్యం, మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు సాధించిన స్కోర్‌కు సరిపోలడం లేదని, వారికి మరింత ఎక్కువ లక్ష్యాన్ని ఇవ్వాలని ఆయన సూచించారు. డక్ వర్త్ లూయిస్ విధానంలో మార్పులు చేయాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News