Duleep Trophy: ఆయుష్ బదోని డబుల్ సెంచరీ.. సెమీస్ కు నార్త్ జోన్

సెమీస్ కు నార్త్ జోన్

Update: 2025-09-01 06:46 GMT

Duleep Trophy: దులీప్ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో ఆయుష్ బదోని అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. నార్త్ జోన్ తరపున ఆడుతూ ఈస్ట్ జోన్‌పై 204 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈస్ట్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం ముగిసిన దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ డ్రా అయ్యింది.388/2 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన నార్త్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 146.2 ఓవర్లలో 658/4 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ డబుల్ సెంచరీతో బదోనీ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ సగటును 60కి పైగా పెంచుకున్నాడు. ఇది బదోనీకి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో రెండో డబుల్ సెంచరీ.ఈ ప్రదర్శనతో బదోనీ, కేవలం టీ20, ఐపీఎల్ ఆటగాడిగా మాత్రమే కాకుండా, సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా మంచి బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. నార్త్ జోన్ మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది.

కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌..

దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ సెమీస్‌‌‌‌‌‌‌‌లో సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌కు... కేరళ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఎంపికైన తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌కు వెళ్లనుండటంతో అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు స్వీకరించనున్నాడు. తమిళనాడు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌. జగదీశన్‌‌‌‌‌‌‌‌కు వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ అప్పగించారు. చేతి గాయం నుంచి కోలుకుంటున్న లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆడటం లేదు. అనికేత్‌‌‌‌‌‌‌‌ శర్మ, షేక్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ (ఆంధ్ర)ను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News