Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్: సౌత్ జోన్ Vs సెంట్రల్ జోన్

సౌత్ జోన్ Vs సెంట్రల్ జోన్

Update: 2025-09-08 04:38 GMT

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న ప్రారంభం కానుంది. మొదటి సెమీ-ఫైనల్స్‌లో సౌత్ జోన్.. రెండో సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్ ఫైనల్‌కు చేరుకుంది.

మొదటి సెమీ-ఫైనల్:

బెంగళూరు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో సౌత్ జోన్ కు నార్త్ జోన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సౌత్ జోన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.సౌత్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 536 పరుగులు చేసి భారీ ఆధిక్యం సంపాదించింది. నారాయణ్ జగదీసన్ 197 పరుగులు చేసి అద్భుతంగా రాణించారు.

రెండో సెమీ-ఫైనల్:

బెంగళూరు, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2 లో వెస్ట్ జోన్ vs సెంట్రల్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా సెంట్రల్ జోన్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. సెంట్రల్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసి వెస్ట్ జోన్‌పై భారీ ఆధిక్యం సాధించింది.ఈ సెమీ-ఫైనల్స్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజేతలను నిర్ణయించారు. దీంతో, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు ఇప్పుడు ఫైనల్‌లో తలపడనున్నాయి.

Tags:    

Similar News