Duleep Trophy Update: దులీప్ ట్రోఫీ నుంచి ఆకాశ్ దీప్, ఇషాన్ ఔట్

ఆకాశ్ దీప్, ఇషాన్ ఔట్;

Update: 2025-08-19 11:48 GMT

Duleep Trophy Update: దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడాల్సిన భారత ఆటగాళ్లు ఆకాశ్‌‌ దీప్ , ఇషాన్ కిషన్‌ గాయాల కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు. ,: ఆకాశ్‌‌ దీప్ వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగో టెస్ట్‌కు కూడా ఇదే కారణంతో దూరమయ్యాడు. అతని స్థానంలో అసోం పేసర్ ముక్తార్ హుస్సేన్‌ను తీసుకున్నారు.

ఇషాన్ కిషన్‌కు మోకాలికి గాయమైంది. బైక్ మీద నుంచి పడటంతో ఈ గాయం తగిలినట్లు సమాచారం. ఇషాన్ కిషన్‌కు బదులుగా ఆశీర్వాద్ స్వైన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే, ఝార్ఖండ్ యువ ఆటగాడు కుమార్‌ కుశాగ్రా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. ఇషాన్ కిషన్ లేకపోవడంతో బెంగాల్‌‌ టాపార్డర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్‌‌కు కెప్టెన్‌‌గా వ్యవహరించనున్నాడు. అస్సాం ఆల్‌‌రౌండర్ రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌‌గా ఉంటాడు.

ఈ ఇద్దరు ఆటగాళ్ళు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో కోలుకుంటున్నారు. త్వరలో ఆస్ట్రేలియా A జట్టుతో జరిగే మ్యాచ్‌ల కోసం ఇషాన్ కిషన్‌ సిద్ధమవుతున్నాడు. వారిద్దరూ కోలుకున్న తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News