Second Ashes Test: యాషెస్ రెండో టెస్ట్ ..రూట్ సెంచరీ.. ఇంగ్లండ్ 325/9
రూట్ సెంచరీ.. ఇంగ్లండ్ 325/9
Second Ashes Test: ఆస్ట్రేలియాతో గురువారం మొదలైన యాషెస్ రెండో టెస్ట్ (డే నైట్)లో ఇంగ్లండ్ మెరుగైన స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై స్టార్ బ్యాటర్ జో రూట్ (202 బాల్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 135 బ్యాటింగ్) తొలిసారి సెంచరీతో చెలరేగడంతో.. తొలి రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 325/9 స్కోరు చేసింది. రూట్‌తో పాటు ఆర్చర్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ బ్యాటర్లను స్టార్క్ (6/71) బాగా ఇబ్బందిపెట్టాడు. ఓపెనర్లలో జాక్ క్రాలీ (76) నిలకడగా ఆడినా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో బెన్ డకెట్ (0), మూడో ఓవర్‌లో ఒలీ పోప్ (0)ని ఔట్ చేసి స్టార్క్ వికెట్ల పతనాన్ని మొదలుపెట్టాడు. అయితే క్రాలీతో జతకలిసిన రూట్ ఆసీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. మధ్యలో హ్యారీ బ్రూక్ (31) ఫర్వాలేదనిపించినా.. బెన్ స్టోక్స్ (19), జెమీ స్మిత్ (0), విల్ జాక్స్ (19), గస్ అట్కిన్సన్ (4), బైడన్ కార్సీ (0) నిరాశపర్చారు. ఆసీస్ గడ్డపై రూట్‌కు ఇది తొలి సెంచరీ కావడంవిశేషం. గతంలో 15 సార్లు ఇక్కడ ఆడినా అత్యధికంగా 89 రన్స్ మాత్రమే చేసిన రూట్ ఈసారి వంద అందుకున్నాడు.