Messi Heads to Hyderabad:ఫ్యాన్స్ కు పండగే.. హైదరాబాద్ కు ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

హైదరాబాద్ కు ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ

Update: 2025-11-03 04:57 GMT

 Messi Heads to Hyderabad: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) డిసెంబర్ 13న హైదరాబాద్‌ కు రానున్నారు. ఫుట్‌బాల్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద పండుగ. గోట్ టూర్ టూ ఇండియా 2025 లో భాగంగా మెస్సీ కోల్‌‌‌‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలకు వచ్చి సందడి చేయనున్నాడు. ఈ పర్యటనలో మెస్సీతో పాటు అతని సహచర ఆటగాళ్లు లూయిస్ సురేజ్ (Luis Suarez) ,రోడ్రిగో డి పాల్ (Rodrigo De Paul) కూడా పాల్గొనే అవకాశం ఉంది.

డిసెంబర్ 13న రాత్రి గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య సెలబ్రిటీలతో కూడిన ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడనున్నాడు. అలాగే ఫుట్‌బాల్ క్లినిక్, సన్మాన కార్యక్రమం, సంగీత కార్యక్రమం కూడా ఉంటాయి.. మెస్సీ భారతదేశ పర్యటనలో మొదట కేరళలోని కొచ్చిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు, అయితే అది రద్దు కావడంతో, దక్షిణాది ఫుట్‌బాల్ అభిమానుల కోసం నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చారు. టికెట్ బుకింగ్స్ త్వరలో (సుమారు వారం రోజుల్లో) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో మెస్సీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తారని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News