Former spinner Saeed Ajmal: చెక్కులు బౌన్స్ అయ్యాయి... పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

పాక్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

Update: 2025-10-01 07:57 GMT

Former spinner Saeed Ajmal: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సంచలన కామెంట్స్ చేశారు. 2009లో పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ జట్టు ఆటగాళ్లకు ఇచ్చిన బహుమతి చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. 2009లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ విజేత జట్టులోని ప్రతి ఆటగాడికి 25 లక్షల పాకిస్తానీ రూపాయల (PKR 25 లక్షలు) బహుమతి చెక్కులను ఇచ్చారు. సయీద్ అజ్మల్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ చెక్కులను బ్యాంకులో వేసినప్పుడు అవి బౌన్స్ అయ్యాయని, అంటే చెల్లింపు జరగలేదని తెలిపారు. ప్రభుత్వ ఖాతాలో డబ్బు లేకపోవడం వల్లే చెక్కులు బౌన్స్ అయినట్లు అజ్మల్ తెలిపారు. ప్రభుత్వ చెక్కులు కూడా బౌన్స్ అవ్వడం తనను షాక్‌కు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ని సంప్రదించినప్పుడు, అది ప్రభుత్వ హామీ అని, తమకు సంబంధం లేదని వారు చెప్పారని అజ్మల్ తెలిపారు. ఆటగాళ్లకు చివరికి వచ్చిన డబ్బు కేవలం ICC (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) నుండి వచ్చిన ప్రైజ్ మనీ మాత్రమేనని అజ్మల్ తెలిపారు.

Tags:    

Similar News