Hitman Rohit Sharma: క్రికెట్ గ్రౌండ్ నుంచి బుల్లితెరకు హిట్‌మ్యాన్.. టీవీ హోస్ట్‌గా రోహిత్ శర్మ !
టీవీ హోస్ట్‌గా రోహిత్ శర్మ !
Hitman Rohit Sharma: క్రికెట్ పిచ్‌పై తన సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యారు. కేవలం మైదానంలోనే కాకుండా, ఇకపై బుల్లితెరపై కూడా తన మార్క్ చూపించేందుకు రోహిత్ శర్మ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ సోనీలివ్ (SonyLIV) వేదికగా ఆయన త్వరలోనే ఒక సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించగా, ఇందుకు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రోహిత్ శర్మ చెప్పిన "ఎవరూ గార్డెన్‌లో తిరగొద్దు" అనే ఫేమస్ డైలాగ్‌ను బేస్ చేసుకుని వదిలిన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన మరో వీడియోలో రోహిత్ ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్‌లా కెమెరా యాంగిల్స్, టెక్నికల్ విషయాలను పరిశీలిస్తూ కనిపించారు.. ఈ షోలో ఆయన కేవలం గెస్ట్‌గా కాకుండా మెయిన్ హోస్ట్ లేదా ప్రెజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు.
టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన రోహిత్ శర్మ, తన ఫ్యాన్స్‌కు పూర్తి స్థాయి వినోదాన్ని పంచేందుకు ఈ రియాలిటీ/ఎంటర్‌టైన్‌మెంట్ షోను ఎంచుకున్నారు. సోనీ నెట్‌వర్క్ దీన్ని 'అత్యంత భారీ ఎంటర్‌టైన్‌మెంట్ డెబ్యూ'గా అభివర్ణిస్తోంది. రాబోయే ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ఈ కార్యక్రమం సెప్టెంబర్ నెలలో టెలివిజన్, ఓటీటీలో ప్రసారం కానుందని సమాచారం.
క్రికెట్ బ్యాట్‌తో మ్యాజిక్ చేసిన రోహిత్ శర్మ, ఇప్పుడు టీవీ హోస్ట్‌గా ఎలాంటి అల్లరి చేస్తారో, ప్రేక్షకులను ఎలా నవ్విస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షోకి సంబంధించిన పూర్తి టైటిల్ , ఫార్మాట్ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.