Hazare Trophy: రోహిత్ ,కోహ్లీ కాదు.. అందరూ హజారే ఆడాల్సిందే

అందరూ హజారే ఆడాల్సిందే

Update: 2025-12-16 04:20 GMT

Hazare Trophy: డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత పెంచే దిశగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి జరిగే విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో) మాత్రమే కాకుండా ప్రస్తుత నేషనల్ టీమ్‌‌‌‌‌‌‌‌లోని ఆటగాళ్లంతా తప్పనిసరిగా కనీసం రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అయినా ఆడాలని స్పష్టం చేసింది. సౌతాఫ్రికా సిరీస్‌‌‌‌‌‌‌‌లో చివరి టీ20కి (ఈ నెల 19), న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే తొలి వన్డే (జనవరి 11) మధ్య దాదాపు మూడు వారాల విరామం ఉన్నందున, సీనియర్ ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడాలని బోర్డు కోరుకుంటోంది. ఈ మేరకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని నేషనల్ సెలెక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ ఇప్పటికే ఈ టో ర్నీకి అందుబాటులో ఉంటామని తెలిపారు. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన టీమిండియా ప్లేయర్లంతా తమ స్టేట్‌‌‌‌‌‌‌‌ టీమ్స్ తరఫున హజారే టోర్నీలో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌తో పాటు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌కు జట్టును సెలెక్టర్లు జనవరి మొదటి వారంలో ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News