ICC ODI Rankings: కోహ్లీని వెనక్కి నెట్టి..టాప్ ప్లేస్ కు మిచెల్

టాప్ ప్లేస్ కు మిచెల్

Update: 2026-01-22 05:06 GMT

ICC ODI Rankings: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డే క్రికెట్ లో టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు. తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఇండియాతో ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మిచెల్ చివరి రెండు మ్యాచ్ లలో వరుస సెంచరీలు కొట్టాడు. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగ బాకాడు. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి 795 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వరుసగా మూడు మ్యాచుల్లో విఫలమ వడంతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘానిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీంద్రాస్ ఇటీపల వన్డేలు ఆడకపోయినా ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్.. టాప్ 10లోకి దూసుకొచ్చా డు. భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ రెండో వన్డేలో అర్ధశతకం చేయడంతో తన ఐదో స్థానాన్నిని లబెట్టుకున్నాడు. ఈ జాబితాలో టాప్ 10లో టీమిండియా ప్లేయర్లే నలుగురు ఉండటం విశేషం.

Tags:    

Similar News