India Announces New Captain for ODI Series: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ..టీమిండియాకు కొత్త కెప్టెన్

టీమిండియాకు కొత్త కెప్టెన్

Update: 2025-11-24 06:23 GMT

India Announces New Captain for ODI Series: సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ . రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమవడంతో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించారు. జైశ్వాల్,నితీశ్ రెడ్డి జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు, బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియాతో ఇటీవలే జరిగిన వన్డే సిరీస్ కు జట్టుకు దూరమైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు జట్టులో చోటు కల్పించారు. మొదటి వన్డే నవంబర్ 30న రాంచీలో జరగనుంది. రెండవ వన్డే డిసెంబర్ 3న రాయ్‌పూర్ లో, మూడో వన్డే డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనుంది.

డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9 న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి.

సిరీస్‌కు భారత జట్టు

కెప్టెన్ (C): కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (VC)(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్,వికెట్ కీపర్లు,ధ్రువ్ జురెల్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా

వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి,బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ (స్పిన్), ప్రసిద్ధ్ కృష్ణ (పేస్), అర్ష్‌దీప్ సింగ్ (పేస్), హర్షిత్ రాణా (పేస్)

Tags:    

Similar News