Asia Cup: ఆసియా కప్ సూపర్ 4 లో ఇండియా ఓటమి

సూపర్ 4 లో ఇండియా ఓటమి

Update: 2025-09-12 06:36 GMT

Asia Cup: ఆసియా కప్ హాకీ మహిళల సూపర్ 4 రౌండ్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-4 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. చైనా ఈ మ్యాచ్‌లో చాలా దూకుడుగా ఆడి, భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. భారత్ తరపున ముంతాజ్ ఖాన్ ఏకైక గోల్ చేసింది. చైనా తరపున జౌ మిరాంగ్ (2 గోల్స్), చెన్ యాంగ్, టాన్ జిన్హువాంగ్ గోల్స్ చేశారు.

ఈ ఓటమితో భారత జట్టు ఫైనల్ చేరడం కాస్త కష్టమైంది. అయినప్పటికీ, వారికి ఇంకా అవకాశం ఉంది. సూపర్ 4 రౌండ్‌లో చివరి మ్యాచ్‌లో శనివారం జపాన్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ డ్రా చేసుకున్నా లేదా ఓడిపోయినా, ఫైనల్ ఆశలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటాయి.

ఈ టోర్నమెంట్‌లో చైనా చాలా పటిష్టంగా ఉంది, ఇంకా వారికి ఒక్క గోల్ కూడా లీగ్ దశలో పడలేదు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు ముంతాజ్ ఖాన్ ద్వారా ఒక గోల్ సాధించి చైనా డిఫెన్స్‌ను ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది.

Tags:    

Similar News