Asian Archery Championship: ఆసియా ఆర్చరీలో ఇండియాకు 10 మెడల్స్
ఇండియాకు 10 మెడల్స్
Asian Archery Championship: ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్‌లో భారతదేశం చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. తెలుగు తేజం జ్యోతి సురేఖ వెన్నం మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించగా, ప్రీతికా ప్రదీప్ రజత పతకం గెలుచుకుంది . యశ్‌దీప్ భోగే, అతాను దాస్,రాహుల్‌తో కూడిన భారత జట్టు 18 ఏళ్ల తర్వాత స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. మొత్తం 10 పతకాలతో టోర్నీని ముగించింది. 6 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది.
గోల్డ్ మెడల్స్
పురుషుల రికర్వ్ టీమ్: యశ్‌దీప్ భోగే, అతాను దాస్, రాహుల్‌తో కూడిన భారత జట్టు 18 ఏళ్ల తర్వాత స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది.
మహిళల రికర్వ్ వ్యక్తిగత: అంకిత భకత్.
పురుషుల రికర్వ్ వ్యక్తిగత: ధీరజ్ బొమ్మదేవర (రాహుల్‌పై గెలిచి).
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత: జ్యోతి సురేఖ వెన్నం.
మహిళల కాంపౌండ్ టీమ్: జ్యోతి సురేఖ వెన్నం, దీప్‌శిఖ, ప్రీతికా ప్రదీప్‌తో కూడిన జట్టు.
కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్: అభిషేక్ వర్మ, దీప్‌శిఖ జోడీ.