India vs New Zealand T20 series: ఇవాళ న్యూజిలాండ్ తో భారత్ ఐదో టీ20
భారత్ ఐదో టీ20
India vs New Zealand T20 series: భారత్ ,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది. తొలి మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి పుంజుకుంది.ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత్‌కు ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. అందుకే తుది జట్టును పరీక్షించుకోవడానికి ఇది మంచి అవకాశం. కేరళ స్టార్ సంజూ శామ్సన్ తన సొంత గడ్డపై ఆడుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అతను ఫుట్ మూవ్‌మెంట్, బ్యాట్ స్వింగ్‌లాంటి సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడుతున్నాడు. కనీసం సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లోనైనా శాంసన్ ఆ లోపాలను అధిగమిస్తాడేమో చూడాలి. తిరువనంతపురం స్టేడియంలో భారత్ ఆడిన 4 టీ20ల్లో 3 గెలిచి మంచి రికార్డును కలిగి ఉంది.