India vs New Zealand T20 series: ఇవాళ భారత్, న్యూజిలాండ్ తొలి టీ20
తొలి టీ20
India vs New Zealand T20 series: ఇవాళ భారత్ , న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఇది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. తిలక్ వర్మ గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు దూరం కాగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు.ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో గెలుచుకుంది, కాబట్టి టీ20ల్లో భారత్ బలంగా పుంజుకోవాలని చూస్తోంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టుకు ఇదే ఆఖరి టీ20 సిరీస్, అందుకే ఈ మ్యాచ్ చాలా కీలకం.
తుది జట్లు ( అంచనా)
ఇండియా: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ / శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రింకూ సింగ్, హర్షిత్ రాణా / శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), టిమ్ రాబిన్సన్, డేవన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.