International Cricket Council (ICC): శ్రీలంక క్రికెటర్ సాలియా సమన్‌పై ఐదేళ్ల నిషేధం
సాలియా సమన్‌పై ఐదేళ్ల నిషేధం;
International Cricket Council (ICC): శ్రీలంక మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సాలియా సమన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఐదేళ్ల నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించినందుకు అతడిపై ఈ చర్య తీసుకుంది. 2021లో జరిగిన అబుదాబి టీ10 లీగ్‌లో మ్యాచ్‌లను ఫిక్స్ చేయడానికి సాలియా సమన్ ప్రయత్నించాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 2.1.1, 2.1.3, 2.1.4 లను అతను ఉల్లంఘించినట్లు ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ తేల్చింది. 2023 సెప్టెంబర్ 13న అతడిపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు విధించిన ఐదేళ్ల నిషేధం ఈ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. 39 ఏళ్ల సాలియా సమన్ శ్రీలంక తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు, కానీ దేశీయ క్రికెట్‌లో 101 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 77 లిస్ట్-ఎ మ్యాచ్‌లు మరియు 47 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ చర్య ఐసీసీ అవినీతిని ఏ మాత్రం సహించదని మరోసారి స్పష్టం చేసింది. క్రికెట్‌లో నిజాయితీని కాపాడటానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఐసీసీ తెలిపింది.