Syed Mushtaq Ali Trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విన్నర్ జార్ఖండ్
విన్నర్ జార్ఖండ్
Syed Mushtaq Ali Trophy: కెప్టెన్ ఇషాన్ కిషన్ (49 బాల్స్‌లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 101) మెరుపు సెంచరీతో విజృంభించడంతో జార్ఖండ్ టీమ్ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ తో పాటు కుమార్ కుశాగ్ర (38 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన ఫైనల్లో జార్ఖండ్ 69 రన్స్ తేడాతో హర్యానాపై గెలిచింది. టాస్ ఓడిన జార్ఖండ్ 20 ఓవర్లలో 262/3 స్కోరు చేసింది. మూడు రన్స్ వద్ద విరాట్ సింగ్ (2) ఔటైనా.. ఇషాన్, కుశాగ్ర రెండో వికెట్‌కు 177 రన్స్ జోడించారు. ఏడు రన్స్ తేడాతో ఈ ఇద్దరూ వెనుదిరిగినా.. చివర్లో అనుకూల్ రాయ్ (20 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్), రాబిన్ మిన్జ్ (14 బాల్స్‌లో 3 సిక్స్‌లతో 31 నాటౌట్) చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 75 రన్స్ జత చేశారు. అన్షుల్ కాంబోజ్, సుమిత్ కుమార్, సమంత్ జాఖర్ తలో వికెట్ తీశారు. తర్వాత హర్యానా 18.3 ఓవర్లలో 193 రన్స్‌కే ఆలౌటైంది. యశ్వర్ధన్ దలాల్ (53) టాప్ స్కోరర్. సమంత్ జాకర్ (38), నిశాంత్ (31) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. సుశాంత్ మిశ్రా, బాల్‌కృష్ణ చెరో మూడు, వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అనుకూల్ రాయ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.