Kohli : లండన్ లో ప్రాక్టీస్ షురూ చేసిన కోహ్లీ...

ప్రాక్టీస్ షురూ చేసిన కోహ్లీ...;

Update: 2025-08-09 15:12 GMT

Kohli : విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోహ్లీ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నాడు. అక్కడే ఒక ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొంటున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమిన్ పర్యవేక్షణలో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్ ఐపీఎల్ తర్వాత కోహ్లీ ఆడబోయే మొదటి అంతర్జాతీయ సిరీస్.నయీమ్ అమిన్ తో దిగిన ఫోటోను తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన కోహ్లీ ప్రాక్టీస్ కు హెల్ప్ చేసినందుకు థ్యాంక్యూ బ్రదర్ .. నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు.

కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినందున, ఇకపై వన్డే క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టనున్నాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లో 30 సెంచరీలు సాధించారు.వీటితో పాటు 7 డబుల్ సెంచరీలు కూడా నమోదు చేశారు.

టెస్ట్ ఫార్మాట్ నుండి కోహ్లీ 2025 మే నెలలో రిటైర్మెంట్ ప్రకటించారు.కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక సెంచరీ మాత్రమే సాధించారు.ఈ సెంచరీ 2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించారు. కోహ్లీ టీ20 ఫార్మాట్ నుండి 2024లో రిటైర్ అయ్యారు.

ప్రస్తుతం కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇందులో ఆయన 51 సెంచరీలు సాధించారు.

Tags:    

Similar News