Dhoni: కోహ్లీ కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ: ధోనీ
ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ: ధోనీ;
Dhoni: క్రికెట్ దిగ్గజాలైన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న బంధం గురించి ధోనీ ఇటీవల కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ, కోహ్లీ ఒక కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ , కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, మిమిక్రీ చేయడంలో కోహ్లీ చాలా చురుగ్గా ఉంటాడని చెప్పాడు.
కోహ్లీ తన కెరీర్ ప్రారంభంలోనే చాలా ప్లానింగ్‌తో ఆడేవాడని, జట్టు గెలుపు కోసం తన వంతుగా ఎంతో కష్టపడేవాడని ధోనీ తెలిపాడు. ఇన్నింగ్స్ మొత్తం నాటౌట్‌గా ఉండి మ్యాచ్ గెలిపించాలని కోహ్లీ తపన పడేవాడని ధోనీ గుర్తు చేసుకున్నారు. మేమిద్దరం భారత్ కోసం చాలా కాలం కలిసి ఆడాం. క్రీజులో ఉన్నప్పుడు ఎక్కువగా డబుల్స్, ట్రిపుల్స్ తీసేవాళ్ళం. అది ఎప్పుడూ సరదాగా ఉండేది" అని ధోనీ అన్నారు. కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని ఆయన ప్రశంసించారు.
ఇక ఐపీఎల్ గురించి మాట్లాడిన ధోని..నేను ఆడినా, ఆడకపోయినా, ఎప్పటికీ పసుపు జెర్సీలోనే ఉంటాను. నేను, CSK రాబోయే 15-20 ఏళ్ల పాటు కలిసే ఉంటాం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చెన్నై అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి. రాబోయే సీజన్లలో జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయని, ఐపీఎల్ 2026 మెగా వేలంలో వాటిని సరిదిద్ది, బ్యాటింగ్ లైనప్‌ను బలోపేతం చేస్తామని చెప్పాడు ధోని.