Series Belongs to New Zealand: కోహ్లీ సెంచరీ వృథా..న్యూజిలాండ్ దే సిరీస్

న్యూజిలాండ్ దే సిరీస్

Update: 2026-01-19 04:30 GMT

Series Belongs to New Zealand: ఇండోర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకోవడమే కాకుండా, భారత గడ్డపై తమ తొలి వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 337/8 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 137 పరుగులు (వరుసగా రెండో సెంచరీ).

గ్లెన్ ఫిలిప్స్ 106 పరుగులు (కేవలం 88 బంతుల్లో). చేశారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు 219 పరుగుల భారీ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్ (3/63), హర్షిత్ రాణా (3/84) రాణించారు.

338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ 124 పరుగులు .(ఇది కోహ్లీకి 54వ వన్డే సెంచరీ, 85వ అంతర్జాతీయ సెంచరీ). నితీష్ కుమార్ రెడ్డి 53 పరుగులు, హర్షిత్ రాణా 52 పరుగులు (తన తొలి అంతర్జాతీయ అర్ధ సెంచరీ) చేసినా భారత్ 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ కోల్పోయింది.న్యూజిలాండ్ బౌలర్లలో క్లార్క్ (3/54), జాక్ ఫౌక్స్‌ (3/77) కీలక వికెట్లు తీశారు.

చారిత్రాత్మక రికార్డులు

1955 నుండి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్, ఇక్కడ వన్డే సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.

వన్డే క్రికెట్ చరిత్రలో 3వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికీ పాంటింగ్‌ను అధిగమించి కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు.

Tags:    

Similar News