Kohli’s Tweet: కోహ్లీ ట్వీట్ వైరల్.. ఫ్యాన్స్ ఖుషి

ఫ్యాన్స్ ఖుషి

Update: 2025-10-16 08:27 GMT

Kohli’s Tweet: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన కోహ్లి, దాదాపు ఏడు నెలల తర్వాత భారత జెర్సీలో కనిపించనున్నాడు. ఈ నెల 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లి ఆడనున్నాడు. ఇప్పటికే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో వన్డే ప్రపంచకప్-2027లో కోహ్లి ఆడతాడా లేదా అనే ప్రశ్న క్రికెట్ అభిమానులలో నెలకొంది.

కోహ్లి, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత ఇవ్వలేదు. మెగా టోర్నీకి ఇంకా రెండేళ్లు ఉండడంతో ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.

అయితే, వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ'లో పాల్గొనాల్సిందేనని అగార్కర్ తేల్చి చెప్పారు. రోహిత్-కోహ్లి ఆ టోర్నీలో ఆడతారా లేదా అనేది తెలియదు. ఈ చర్చల నేపథ్యంలో విరాట్ కోహ్లి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. "ఎప్పుడైతే మీరు ఒక పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫలమైనట్లే" అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు. కోహ్లి ట్వీట్‌తో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లి తప్పకుండా ఆడతాడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News