Trending News

Cricket: ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు దిగ్గజ ఆటగాళ్ల పేర్లు

దిగ్గజ ఆటగాళ్ల పేర్లు

Update: 2025-06-06 13:01 GMT

Cricket:జూన్ 20 నుండి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. దీని కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీం ఇండియాను కూడా ప్రకటించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్ జరుగుతుండగా, యువ ఆటగాళ్లపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ టెస్ట్ సిరీస్‌కు ట్రోఫీకి దిగ్గజ ఆటగాళ్ల పేరు పెట్టారు.

ఈ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సచిన్ టెండూల్కర్-జేమ్స్ ఆండర్సన్ ట్రోఫీ కింద జరుగుతుంది. ఇది ఇద్దరు గొప్ప టెస్ట్ క్రికెటర్లకు ఇచ్చే గౌరవం. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టెస్ట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టెండూల్కర్ 1989 నుండి 2013 వరకు 22 సంవత్సరాల కాలంలో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

ఇంగ్లాండ్ తరఫున -జేమ్స్ ఆండర్సన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్. జేమ్స్ ఆండర్సన్ 704 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 42 సంవత్సరాల వయసులో అతను తన రిటైర్ మెంట్ ప్రకటించాడు.

Tags:    

Similar News