Kane Williamson Makes a Sensational Decision:న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
Kane Williamson Makes a Sensational Decision: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. టీ20 క్రికెట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ చెబుతున్నట్టు ప్రకటించారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టుకు స్పష్టత ఇవ్వడానికి , యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆయన టెస్ట్ , వన్డే క్రికెట్‌ను కొనసాగిస్తారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఆడటం కూడా కొనసాగిస్తారు. కేన్ విలియమ్సన్ తన అంతర్జాతీయ పనిభారాన్ని తగ్గించుకోవాలని, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, ఫ్రాంచైజీ లీగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నారు.
న్యూజిలాండ్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు 93 మ్యాచుల్లో 2,575 పరుగులు చేసిన రెండో ఆటగాడు కేన్ విలయమ్సన్ . ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు95 పరుగులు. 75 టీ20 మ్యాచులకు నాయకత్వం వహించారు. అతని నాయకత్వంలో జట్టు 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2016,2022 సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంది. 35 ఏళ్లకే టీ20లకు గుడ్ బై చెప్పడంపై అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.