World Cup Winners: వరల్డ్ కప్ విన్నర్స్ కు రేపు ప్రధాని విందు

రేపు ప్రధాని విందు

Update: 2025-11-04 07:22 GMT

World Cup Winners: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించనున్నారు. టీమిండియా జట్టును రేపు న్యూఢిల్లీలో ప్రధాని మోదీ కలవనున్నారు. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి, తొలిసారిగా భారత్‌కు ప్రపంచ కప్‌ను తీసుకువచ్చినందుకు అభినందించనున్నారు. ప్రధాని మోదీ ఈ విజయాన్ని 'అసాధారణ జట్టు స్ఫూర్తి,పట్టుదలకు నిదర్శనంగా అభివర్ణించారు.ఈ చారిత్రక విజయం భవిష్యత్తులో క్రీడలను చేపట్టడానికి ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందన్నారు.

ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే... ఇది భారత మహిళల జట్టుకు తొలి ప్రపంచ కప్ టైటిల్. బ్యాటింగ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ (87) మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేసింది.ఆల్ రౌండర్ దీప్తి శర్మ బ్యాటింగ్‌లో (58) కీలక భాగస్వామ్యం అందించి, స్కోరును 300కు చేరువ చేసింది.బౌలింగ్‌లో దీప్తి శర్మ కేవలం 39 పరుగులకే 5 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ కప్ ఫైనల్‌లో 5 వికెట్లు తీసిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డు సృష్టించింది.సెంచరీతో ప్రమాదకరంగా మారుతున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) వికెట్ దీప్తికే దక్కింది. షఫాలీ వర్మ 87 పరుగులు చేసి, 2 కీలక వికెట్లు కూడా పడగొట్టింది. అమన్‌జోత్ కౌర్ మెరుపు రనౌట్ కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పింది.ఈ విజయం ద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించింది!

Tags:    

Similar News