Punjab Drops Explosive Player: విధ్వంసకర ఆటగాడిని వదిలేసిన పంజాబ్

ఆటగాడిని వదిలేసిన పంజాబ్

Update: 2025-11-15 06:27 GMT

Punjab Drops Explosive Player: ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. మాక్స్ వెల్ తో పాటు, పంజాబ్ కింగ్స్ ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, విష్ణు వినోద్ వంటి ఆటగాళ్లను కూడా వదిలివేసింది.

ఐపీఎల్ లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. IPL 2025 సీజన్‌లో మాక్స్ వెల్ గాయం కారణంగా టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించవలసి వచ్చింది. గత కొద్ది సీజన్లలో అతను ఆశించిన స్థాయిలో స్థిరంగా రాణించలేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఆటగాళ్లను వదిలివేయడం వలన ఫ్రాంచైజీకి తదుపరి వేలంలో ఇతర ముఖ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి డబ్బు పెరుగుతుంది.

మాక్స్వెల్ జూన్ 2న వన్డే ఇంటర్నేషనల్ (ODI) క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే .మాక్స్‌వెల్ 149 వన్డే మ్యాచ్‌లలో, అతను 33.81 సగటుతో 3,990 పరుగులు చేశాడు, 126.70 స్ట్రైక్ రేట్‌తో చరిత్ర సృష్టించాడు.

Tags:    

Similar News