Young Sensation Vaibhav Suryavamsi: 14 ఏళ్లకే రంజీ వైస్ కెప్టెన్.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనత..

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఘనత..

Update: 2025-10-14 06:00 GMT

Young Sensation Vaibhav Suryavamsi: యంగ్ స్టార్, కేవలం 14 ఏళ్ల వయస్సు ఉన్న వైభవ్ సూర్యవంశీ మరో గొప్ప ఘనత సాధించాడు. రాబోయే రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన బిహార్ క్రికెట్ జట్టుకు అతన్ని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సూర్యవంశీకి 12 ఏళ్ల వయస్సులోనే రంజీ ట్రోఫీలో ఆడిన అనుభవం ఉంది. ఆ తర్వాత 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడి ఒక రికార్డు సృష్టించాడు.

ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు తరఫున కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఇంత తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడు ఇతనే.

రంజీలో బాధ్యతలు

తొలి రెండు మ్యాచ్‌లకు బిహార్ జట్టుకు సకిబుల్ గని కెప్టెన్‌గా ఉంటాడు. వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గత సీజన్‌లో బిహార్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఈసారి ఆ జట్టు ప్లేట్ లీగ్‌లో ఆడనుంది. వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. అందులో వైభవ్ ఆడవచ్చు. అందుకే ఈ మొత్తం రంజీ సీజన్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం తక్కువ.

Tags:    

Similar News