Sania Mirza’s Dubai Homes: సానియా మీర్జా దుబాయ్ ఇళ్లు.. వీడియో వైరల్
వీడియో వైరల్
Sania Mirza’s Dubai Homes: టెన్నిస్ దిగ్గజం, ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సాన్యా మీర్జా తన దుబాయ్ ఇంటికి సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆమె తాజాగా తన ఇంటి అలంకరణకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఈవెంట్ మేనేజ్‌మెంట్ టీమ్ షేర్ చేసిన ఈ ఫోటోలలో సాన్యా నివాసం 'వైట్ అండ్ ఐవరీ' (తెలుపు, దంతపు రంగు) థీమ్‌తో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. లేత రంగు తెరలు, వెచ్చని కాంతులు చిమ్మే లైట్లు, తెల్లని పూలు మరియు వరుసగా అమర్చిన కొవ్వొత్తులతో ఇల్లు ఒక క్లాసీ లుక్‌ను సంతరించుకుంది. ఇంటి లోపలి భాగంతో పాటు పూల్‌సైడ్ ఏరియాను కూడా ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అయితే, ఇంత అందంగా ఇల్లు అలంకరించడానికి గల కారణాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇది ఏదైనా కుటుంబ వేడుక కావచ్చు లేదా ఏదైనా ప్రత్యేక ప్రకటనకు సంకేతం కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.
ఇంటి ఫోటోలను పంచుకోవడానికి కొద్దిరోజుల ముందే సాన్యా 'ది నెక్స్ట్ సెట్' (The Next Set) అనే తన కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి, వర్ధమాన మహిళా క్రీడాకారిణులకు అండగా నిలవడమే ఈ సంస్థ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకునే ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వృత్తిపరమైన సహకారం, శిక్షణ అందించడంపై ఈ ప్రోగ్రామ్ దృష్టి సారిస్తుంది.
టెన్నిస్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, సాన్యా మీర్జా వివిధ రంగాలలో బిజీగా గడుపుతున్నారు. దుబాయ్, హైదరాబాద్‌లలో తన అకాడమీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు లీడ్ కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒంటరి తల్లిగా తన జీవిత ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే, మహిళా క్రీడల అభివృద్ధి కోసం, వ్యాపారవేత్తగా ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు.