Shami Fires Over Fitness: ఫిట్‌నెస్‌పై షమీ ఫైర్ ... సెలెక్టర్లపై ప్రశ్నల వర్షం

సెలెక్టర్లపై ప్రశ్నల వర్షం

Update: 2025-10-15 07:25 GMT

Shami Fires Over Fitness: భారత క్రికెట్ జట్టు సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ, తన ఫిట్‌నెస్ గురించి సెలెక్టర్లు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడం, దీనిపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీశాయి.

బుధవారం నుంచి ఉత్తరాఖండ్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సెలక్టర్లపై ఘాటుగా స్పందించారు. "జట్టులో ఎంపిక కావడం నా చేతుల్లో లేదనేది వాస్తవం. అయితే, నేను ఫిట్‌గా లేకపోతే ఇప్పుడు రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యేవాడిని కాదు" అని షమీ స్పష్టం చేశారు.

"నేను నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు, 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ఎందుకు ఆడలేను? ఇది కచ్చితంగా వివాదాస్పదం చేయదల్చుకోలేదు. కానీ, నా ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇవ్వడం లేదా అడగడం అనేది నా పని కాదు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లి సన్నద్ధం కావడమే నేను చేయగలిగేది" అని ఆయన పేర్కొన్నారు.

Tags:    

Similar News