South Africa: ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విక్టరీ

సౌతాఫ్రికా విక్టరీ

Update: 2025-09-12 06:32 GMT

South Africa: ఇంగ్లాండ్ తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ఆధారంగా మ్యాచ్ గెలిచింది

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం పలుమార్లు అడ్డుకుంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వల్ల ఓవర్లను కుదించగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 14 బంతుల్లో 28 పరుగులు చేశాడు.డొనోవాన్ ఫెరీరా 11 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

వర్షం మరోసారి రావడంతో ఇంగ్లాండ్‌కు DLS పద్ధతి ప్రకారం 5 ఓవర్లలో 69 పరుగుల సవరించిన లక్ష్యాన్ని నిర్దేశించారు.ఈ కష్టమైన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లాండ్ విఫలమైంది. నిర్ణీత 5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. ఫెరీరాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు.

Tags:    

Similar News