Suresh Raina: చెన్నైకి జడేజా గన్ ప్లేయర్..అతడిని వదులుకోవద్దు

అతడిని వదులుకోవద్దు

Update: 2025-11-11 11:00 GMT

Suresh Raina: జడేజాను CSK వదులుకోనుందనే వార్తల నేపథ్యంలో ఆ జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా స్పందించారు. జడేజాను కచ్చితంగా రిటైన్ చేసుకోవాలన్నారు. CSKకు అతను గన్ ప్లేయర్ అని, టీమ్ కోసం కొన్నేళ్లుగా ఎంతో చేస్తున్నారని గుర్తు చేశారు. ‘సర్ జడేజా’ జట్టులో ఉండాల్సిందే అని జట్టు యాజమాన్యానికి సలహా ఇచ్చినట్లు సమాచారం. RRతో ట్రేడ్‌లో జడేజా స్థానంలో CSK సంజూను తీసుకోవడం ఖరారైనట్లు క్రీడావర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ, రవీంద్ర జడేజాను ట్రేడ్ (వేరే జట్టుకు పంపే) చేసే అవకాశం ఉందనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో, CSK మాజీ ఆటగాడు , లెజెండ్ అయిన సురేష్ రైనా స్పందించారు.రైనా జడేజాను వదులుకోవద్దని CSK మేనేజ్‌మెంట్‌కు బలంగా సూచించారు."రవీంద్ర జడేజాను మళ్లీ రిటైన్ చేసుకోవాలి. అతను CSKకి ఒక 'గన్ ప్లేయర్'.""అతను చాలా సంవత్సరాలుగా జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. కాబట్టి, 'సర్ రవీంద్ర జడేజా' కచ్చితంగా జట్టులో ఉండాలి.అని అన్నారు.

ఐపీఎల్ 2026 కోసం CSK,రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య ప్లేయర్ ట్రేడింగ్ గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి.రవీంద్ర జడేజా (CSK)ను RRకు ఇచ్చి, సంజు శాంసన్ (RR)ను CSKలోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు ఈ చర్చకు దారి తీశాయి.ఈ నేపథ్యంలో, CSKకు జడేజా ఎంత ముఖ్యమో నొక్కి చెబుతూ, అతన్ని వదులుకోవడం పెద్ద పొరపాటు అవుతుందని రైనా తన అభిప్రాయాన్ని చెప్పారు రైనా.

Tags:    

Similar News