T20 World Cup: ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్.!
టీ20 వరల్డ్ కప్.!
T20 World Cup: 2026లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు భారత్ , శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే అవకాశం ఉంది. ఐసీసీ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు భారత్‌లోని ఐదు వేదికల్లో, శ్రీలంకలోని రెండు వేదికల్లో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే, పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఈ మ్యాచ్ కొలంబోకు మార్చబడుతుంది.
ఈసారి టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వాటిలో కొన్ని ఇప్పటికే అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ ఫార్మాట్ 2024 టీ20 ప్రపంచ కప్ లాగే ఉంటుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూపు దశ తర్వాత, మెరుగైన ప్రదర్శన చేసిన జట్లు 'సూపర్-8' దశకు చేరుకుంటాయి.భారత్ ఈ టోర్నమెంట్‌కు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.