Team India Unveils New Jersey: టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా కొత్త జెర్సీ
టీమిండియా కొత్త జెర్సీ
Team India Unveils New Jersey: 2026 టీ20 వరల్డ్ కప్‌కి టీమ్ ఇండియా జెర్సీని విడుదల చేశారు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో దీనిని ఆవిష్కరించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ మాజీ భారత కెప్టెన్ అయిన రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాడు తిలక్ వర్మ దీనిని ప్రదర్శించారు.
ఈ కొత్త జెర్సీ డిజైన్ 1990ల నాటి ఐకానిక్ స్ట్రైప్డ్ ఇండియా జెర్సీల నుండి ప్రేరణ పొంది రూపొందించబడింది. ప్రధానంగా ముదురు నీలం రంగులో ఉంటుంది.భుజాల (Shoulders)పై నిలువుగా ఆరెంజ్ రంగులో స్ట్రైప్స్ ఉన్నాయి.
కాలర్ (మెడ భాగం) వద్ద తెలుపు రంగు కూడా కనిపిస్తుంది.ఈ డిజైన్‌లో 'రెట్రో' స్టైల్‌ను ఆధునిక టెక్నాలజీతో మిళితం చేసినట్లుగా తెలుస్తోంది.ఈ కొత్త జెర్సీని ధరించి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆడనుంది.
ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం కానుంది.టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూపులో ఉన్నాయి.