సచిన్‌ టెండూల్కర్‌ ఇంట త్వరలో పెళ్ళి సందడి

సానియో చందోక్‌తో అర్జున్‌ టెండూల్కర్‌ నిశ్చితార్ధం;

Update: 2025-08-14 04:42 GMT

భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఇంటి పెళ్ళి భాజాలు మోగనున్నాయి. సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ కు పెళ్ళి నిశ్చమైనట్లు సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముంబయ్‌కి చెందిన వ్యాపార వేత్త రవిఘాయ్‌ మనుమరాలు సానియా చందోక్‌ తో అర్జున్‌కి నిశ్చితార్ధం కూడా అయిపోయినట్లు ముంబయ్‌ వర్గల్లో చర్చ జరుగుతోంది. పరిమిత అతిధులతో పాటు సచిన్‌, రవిఘాయ్‌ల కుటుంబ సభ్యల సమక్షంలో నిరాడంబరంగా ఈ నిశ్చితార్ధవేడుకలు నిర్వహించినట్లు సమాచారం. అయితే వీరి నిశ్చితార్ధం వివరాలను ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచుతున్నాయి. ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి వారి నుంచి ఎటువంటి అదికారిక ప్రకటన వెలువడలేదు. ఇక సానియా చందోక్‌ లండన్‌ స్కూల్ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ముంబయ్‌లో ప్రముఖ పెట్‌ కేర్‌ బ్రాండ్‌ మిస్టర్‌ పాస్‌ పెట్‌ స్పా అండ్‌ స్టోర్‌కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News