Two New Teams: ప్రపంచ క్రికెట్‌లోకి మరో రెండు కొత్త జట్లు..

క్రికెట్‌లోకి మరో రెండు కొత్త జట్లు..

Update: 2025-07-21 10:01 GMT

Two New Teams: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశం సింగపూర్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఛాంపియన్స్ లీగ్ T20 పునఃప్రారంభంతో సహా వివిధ అంశాలపై చర్చించారు. అదనంగా, క్రికెట్ ప్రపంచానికి 2 కొత్త జట్లు పరిచయం కానున్నాయి. ఈ నిర్ణయం, ఐసిసి సభ్య జట్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 110కి చేరుకుంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేలా చేయడానికి, కొత్త రంగాలలో దాని అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఇది ఒక ముఖ్యమైన చొరవగా చెబుతున్నారు.

ఈ రెండు జట్ల రాక

తైమూర్, జాంబియా ఐసిసి కొత్త జట్లు అని ఐసీసీ తెలిపింది. తైమూర్-లెస్టే క్రికెట్ సమాఖ్య, జాంబియా క్రికెట్ యూనియన్‌లు అధికారికంగా ఐసీసీలో అసోసియేట్ సభ్యులుగా చేరాయి. దీనికి సంబంధించి ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐసీసీ కుటుంబంలో రెండు కొత్త సభ్యుల జట్లు చేరాయి. మొత్తం సభ్యుల జట్ల సంఖ్య 110కి చేరింది. తైమూర్-లెస్టే క్రికెట్ సమాఖ్య, జాంబియా క్రికెట్ యూనియన్ అధికారికంగా ఐసీసీ అసోసియేట్ సభ్యులుగా మారాయి’’ అని ఐసీసీ తెలిపింది.

ఐసీసీలో చేరిన 22వ ఆఫ్రికన్ దేశం జాంబియా. మరోవైపు తైమూర్-లెస్టే ఇప్పుడు తూర్పు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 10వ అసోసియేట్ సభ్య దేశంగా ఉంది. 22 ఏళ్ల క్రితం 2003లో ఫిలిప్పీన్స్ చేరిన తర్వాత ఇదే మొదటిది. ఇటీవలి కాలంలో తైమూర్-లెస్టేలో క్రికెట్ ఊపందుకుంది. అక్కడి యువతలో ఈ ఆట బాగా ప్రాచుర్యం పొందుతోంది. అటువంటి పరిస్థితిలో, తైమూర్-లెస్టే ఇప్పుడు పెద్ద అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడే అవకాశాన్ని పొందుతుంది.

జాంబియాకు రెండో అవకాశం

జాంబియా క్రికెట్ బోర్డు ఐసీసీకి తిరిగి రావడం ఒక స్ఫూర్తిదాయకమైన కథగా చెప్పచ్చు. జాంబియా 2003లో ICCలో అసోసియేట్ సభ్యత్వాన్ని పొందింది. కానీ అక్కడి పాలన సమస్యల కారణంగా 2019లో దాని సభ్యత్వం రద్దు చేశారు. 2021లో జాంబియాను ICC నుండి బహిష్కరించారు. కానీ నాలుగేళ్ల తరువాత జాంబియా తన పరిపాలనా, సంస్థాగత లోపాలను పరిష్కరించుకొన తిరిగి సభ్యత్వాన్ని పొందింది. క్రికెట్ రంగంలో జాంబియాకు ఇది కొత్త ప్రారంభం. 

Tags:    

Similar News