Vijay Hazare Trophy Final Clash: విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ పోరు..విదర్భ vs సౌరాష్ట్ర
విదర్భ vs సౌరాష్ట్ర
Vijay Hazare Trophy Final Clash: విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ, సౌరాష్ట్ర జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్నాయి.నిన్న జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాటర్ విశ్వరాజ్ జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతను కేవలం 127 బంతుల్లోనే 165 నాటౌట్ (18 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయడంతో, సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై భారీ విజయాన్ని అందుకుంది.
గురువారం జరిగిన మొదటి సెమీఫైనల్ (విదర్భ vs కర్ణాటక): డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటకతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విదర్భ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విదర్భ బ్యాటర్ అమన్ మోఖడే (138 పరుగులు) అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు.
రేపు బెంగళూరులో విదర్భ సౌరాష్ట్ర ఫైనల్ పోరులో తలపడనున్నాయి. విదర్భ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టైటిల్‌ను నెగ్గలేదు,కాబట్టి రేపు వారు తమ తొలి ట్రోఫీ కోసం గట్టిగా పోరాడనున్నారు. మరోవైపు సౌరాష్ట్ర తన ఫామ్‌ను కొనసాగించి రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది.