Virender Sehwag: ధోని తీసేయడంతో రిటైర్డ్ అవ్వాలనుకున్నా..సచిన్ చెప్పడంతో ఆగిపోయా

సచిన్ చెప్పడంతో ఆగిపోయా;

Update: 2025-08-16 16:05 GMT

Virender Sehwag: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో భాగస్వాములుగానే కాకుండా, బయట కూడా మంచి స్నేహితులు. ఇటీవల సెహ్వాగ్ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సచిన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2007-08లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో జరిగిన ట్రై-సిరీస్‌లో తాను కేవలం మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనను జట్టు నుంచి తొలగించారని తెలిపారు. ఈ సంఘటనతో తీవ్ర నిరాశకు గురై వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

ఈ విషయం సచిన్ టెండూల్కర్‌కు చెప్పినప్పుడు, సచిన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారని సెహ్వాగ్ వెల్లడించారు. సచిన్ తనకు 1999-2000 మధ్య కాలంలో ఇలాంటి అనుభవం ఎదురైందని, అప్పుడు క్రికెట్‌ను వదిలేద్దామని అనిపించిందని తెలిపారు. కానీ ఆ కష్ట దశ ఎప్పుడూ ఉండదు. అది పోతుంది. నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోకు. మరికొన్ని సిరీస్‌లు ఆగి చూడు అని సచిన్ సలహా ఇచ్చారని సెహ్వాగ్ చెప్పారు.సచిన్ సలహా మేరకు తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుని, తర్వాత సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి 2011 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించానని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నారు.

వీరేంద్ర సెహ్వాగ్ తన ఆటోబయోగ్రఫీలో , పలు ఇంటర్వ్యూలలో సచిన్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని సరదా సన్నివేశాలను పంచుకున్నారు. తాను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏకాగ్రతను కాపాడుకోవడానికి పాటలు పాడుతూ ఉంటానని అది సచిన్‌కు నచ్చేది కాదని చెప్పారు సెహ్వాగ్. 2011 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో ఆడుతున్నప్పుడు, పాటలు పాడుతూ బ్యాటింగ్ చేస్తుండగా సచిన్ కోపంతో తన బ్యాట్‌తో కొట్టి, "నీవు అలా కిషోర్ కుమార్‌లా పాటలు పాడుతూ ఉంటే నేను పిచ్చివాడిని అవుతాను" అని అన్నాడని సెహ్వాగ్ సరదాగా చెప్పారు.

Tags:    

Similar News