Virat Kohli: ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు ఇచ్చారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ క్రికెటర్
స్టార్ క్రికెటర్
Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకు సంబంధించిన ఓ ప్రచారంపై ఆయన ప్రతినిధి స్పందించారు. బృందావన్‌లోని ప్రేమానంద మహరాజ్ ఆశ్రమానికి వెళ్లేందుకు కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారంటూ ఫలహారి మహరాజ్ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, వాస్తవాలకు విరుద్ధం అని స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించడం వెనుక ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన ప్రతినిధి తెలిపారు. వ్యక్తిగత విశ్వాసం, ప్రేమానంద మహరాజ్‌పై ఉన్న గౌరవంతోనే కోహ్లీ ఆశ్రమానికి వెళ్తున్నారని వెల్లడించారు. “విరాట్ కోహ్లీ గురించి ఫలహారి మహరాజ్ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, వాస్తవాలకు విరుద్ధమైనవి.” అలాగే.. కోహ్లీ ప్రేమానంద మహరాజ్‌ను గాఢమైన విశ్వాసం, గౌరవంతోనే కలుస్తున్నారని తెలిపారు.
మీడియా సంస్థలు, జర్నలిస్టులు ఇలాంటి వ్యాఖ్యలను ప్రచారం చేసే ముందు వాస్తవాలను ధ్రువీకరించాలని కోహ్లీ ప్రతినిధి సూచించారు. నిర్ధారణ లేని ఆరోపణలను బాధ్యతారహితంగా ప్రచారం చేయవద్దని కోరారు. కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ తరచూ బృందావన్‌లోని ప్రేమానంద మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోహ్లీ ఆశ్రమ సందర్శనపై దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
ఇక క్రికెట్ విషయానికొస్తే.. కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 139 పరుగులతో అద్భుత సెంచరీ చేసిన కోహ్లీ.. ఆ తర్వాతి మ్యాచ్‌లో 29 పరుగులు, న్యూ చండీగఢ్‌లో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. నవంబర్ 4 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆడనున్నాడు. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ తనకు భారత్ తరఫున చివరి ప్రపంచకప్ అని ఇటీవల 37 ఏళ్ల కోహ్లీ వెల్లడించాడు. “భారత్ తరఫున ఆడే నా చివరి ప్రపంచకప్ అదే. ప్రపంచకప్ గెలవడమే నా లక్ష్యం. అందుకోసం నా శక్తిమేరకు అన్నీ చేస్తా” అని కోహ్లీ చెప్పాడు.