Women's Premier League (WPL) 2026: యూపీ వారియర్స్ పై బెంగళూరు గ్రాండ్ విక్టరీ

బెంగళూరు గ్రాండ్ విక్టరీ

Update: 2026-01-13 06:23 GMT

Women's Premier League (WPL) 2026: నిన్న జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యూపీ వారియర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. దీప్తి శర్మ (45 నాటౌట్‌‌), దియోంద్ర డాటిన్‌‌ (40 నాటౌట్‌‌) రాణించారు. బెంగళూరు బౌలర్లలో నాదైన్ డి క్లెర్క్ , శ్రేయాంక పాటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

తర్వాత టార్గెట్ బరిలో బెంగళూరు 11.4 ఓవర్లలోనే 145/1 స్కోరు చేసింది. కేవలం 40 బంతుల్లోనే 85 పరుగులు (10 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. కెప్టెన్ స్మృతి మంధాన 32 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచి, హారిస్‌కు చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 144 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే పూర్తి చేయడం విశేషం. దీనివల్ల ఆర్సీబీ నెట్ రన్ రేట్ భారీగా పెరిగింది.

Tags:    

Similar News