Women's Premier League (WPL) 2026: అదరగొట్టిన బౌలర్లు..యూపీపై గుజరాత్ విక్టరీ
యూపీపై గుజరాత్ విక్టరీ
Women's Premier League (WPL) 2026: నిన్నజరిగిన డబ్ల్యూపీఎల్ (WPL) 2026 మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ యూపీ వారియర్స్ పై 45 పరుగుల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న గుజరాత్ ను సోఫీ డివైన్ ఆదుకుంటూ 42 బంతుల్లో 50 (నాటౌట్) పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది.రాజేశ్వరి గైక్వాడ్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ బ్యాటర్లలో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32), క్లోయ్ ట్రయాన్ (30) తప్ప మిగిలిన వారు విఫలమయ్యారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (32), చోలే ట్రయాన్ (30 నాటౌట్) మినహా మిగతా వారు నిరాశపర్చారు. గుజరాత్ బౌలర్లు రాజేశ్వరి (3/16), రేణుకా సింగ్ (2/20), సోఫీ డివైన్ (2/16) దెబ్బకు యూపీ ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
గుజరాత్ బౌలర్లలో రేణుక సింగ్, సోఫీ డివైన్ తలో రెండు వికెట్లు తీశారు.ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా, యూపీ వారియర్స్ చివరి స్థానానికి పడిపోయింది.