Women's Premier League (WPL) 2026: చెలరేగిన హర్మన్..గుజరాత్ పై ముంబై విక్టరీ

గుజరాత్ పై ముంబై విక్టరీ

Update: 2026-01-14 13:20 GMT

Women's Premier League (WPL) 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించి, ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (36 నాటౌట్), జార్జియా వేర్హామ్ (43 నాటౌట్) మెరుపులు మెరిపించారు.193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుండి నడిపించింది. ఆమె కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఈ ఇన్నింగ్స్ ద్వారా హర్మన్‌ప్రీత్ కౌర్ WPL చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. హర్మన్‌ప్రీత్‌కు తోడుగా అమన్‌జోత్ కౌర్ (40), నికోలా కేరీ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.ఈ విజయంతో గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌కు ఉన్న అజేయ రికార్డు 8-0కు చేరుకుంది. అంటే ఇప్పటివరకు WPL చరిత్రలో గుజరాత్ ఒక్కసారి కూడా ముంబైని ఓడించలేకపోయింది.

Tags:    

Similar News