Women's Premier League (WPL) 2026: ఆర్సీబీ హ్యాట్రిక్..గుజరాత్ పై ఘన విజయం
గుజరాత్ పై ఘన విజయం
Women's Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ జెయింట్స్ పై 32 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.ఆర్సీబీ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న RCBని వీరు ఆదుకున్నారు. రాధా యాదవ్ (66) తన తొలి WPL హాఫ్ సెంచరీ చేయగా, రిచా ఘోష్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌలింగ్‌లో శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు (5/23) తీసి గుజరాత్ వెన్ను విరిచింది. ఇది ఆమె కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన.ఈమె కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టింది.ఈ విజయంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో వరుసగా మూడు విజయాలను అందుకుని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అజేయంగా ఉన్న ఏకైక జట్టు కూడా బెంగళూరునే.