Australian Open 2026: ఇవాళ ఆస్ట్రేలియా ఓపెన్ లో విమెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్

విమెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్

Update: 2026-01-29 05:16 GMT

Australian Open 2026: ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్ ఇవాళ మెల్‌బోర్న్ పార్క్‌లో జరుగుతున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అర్యానా సబలెంకా vs ఎలినా స్విటోలినా మధ్య జరగనుంది.సబలెంకా వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరాలని చూస్తుండగా, స్విటోలినా తన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కోసం పోరాడుతోంది.మధ్యాహ్నం 3 గంటలకు జెస్సికా పెగులా vs ఎలెనా రైబకినా మధ్య జరగనుంది. క్వార్టర్స్‌లో స్వియాటెక్‌ను ఓడించిన రైబకినా మంచి ఫామ్‌లో ఉంది. పెగులాకు ఇది తొలి ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్. డిఫెండింగ్ రన్నరప్ అయిన సబలెంకా, ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా అజేయంగా దూసుకొస్తోంది. క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్‌ను చిత్తుగా ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె 10 మ్యాచ్‌ల విన్నింగ్ స్ట్రీక్‌లో ఉంది.

Tags:    

Similar News