Women's World Cup 2025: అమ్మాయిలు కుమ్మేశారు..పాక్ ను చిత్తు చేశారు
పాక్ ను చిత్తు చేశారు
Women's World Cup 2025: కొలంబోలోని ఆర్. ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్తాన్‌పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.హర్లీన్ డియోల్ (Harleen Deol) 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.చివర్లో రిచా ఘోష్ (Richa Ghosh) 20 బంతుల్లో 35* పరుగులతో వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచింది.పాకిస్తాన్ బౌలర్లలో డయానా బేగ్ (Diana Baig) 4 వికెట్లు పడగొట్టింది.
248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.పాకిస్తాన్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (Sidra Amin) ఒక్కరే పోరాడి 81 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు.యువ పేస్ బౌలర్ క్రాంతి గౌడ్ (Kranti Gaud) కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. స్పిన్నర్ దీప్తి శర్మ (Deepti Sharma) కూడా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
క్రాంతి గౌడ్ (Kranti Gaud)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఈ విజయంతో భారత్ మహిళల జట్టు వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌పై తమ 12-0 అజేయ రికార్డును కొనసాగించింది.