Bharat Rashtra Samithi: ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన భారత రాష్ట్ర సమితి

సస్పెండ్ చేసిన భారత రాష్ట్ర సమితి

Update: 2025-09-02 09:28 GMT

Bharat Rashtra Samithi: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున, దానిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్‌, టి.రవీందర్‌రావు పేరిట ప్రకటన విడుదల చేసింది.

"ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయి. అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు" అని భారత రాష్ట్ర సమితి పేర్కొంది.

Tags:    

Similar News