Vice President Elections: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

Update: 2025-09-08 05:41 GMT

Vice President Elections: రేపు జరగనున్న భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీఏ మరియు ఇండియా కూటమి రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సరైనదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం మరోసారి బహిర్గతమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తోందని, ఇది సామాన్య రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి కూడా స్పష్టమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహVetala

System: హన్ రెడ్డి మీ రామ్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఇది బీఆర్ఎస్-బీజేపీ ల మధ్య అసలైన సంబంధం బయటపడిందని ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News