CM Revanth Reddy: బీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణ పోరాటంలో ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఆత్మరక్షణ పోరాటంలో ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2025-12-29 12:32 GMT

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడమే బీఆర్‌ఎస్‌ ప్రధాన లక్ష్యంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల దాడులకు ఘాటుగా కౌంటర్ ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు. జిల్లాల వారీగా మంత్రులు సన్నద్ధమై, ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశానికి సమగ్ర సమాధానాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనవరి 4 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.

ఇట్టే మరోవైపు, స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల పని దినాలు, అజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

రాష్ట్ర రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలతో ముఖాముఖి ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.

Tags:    

Similar News