Danam Nagender: సుప్రీంకోర్టు దానం నాగేందర్‌కు మరోసారి చుక్కెదురు పెట్టింది. అనర్హత వేటు విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది.

ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఘర్‌వాపసీ చట్టసభ సభ్యులకు వర్తించదని, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

దానం నాగేందర్‌ తన పిటిషన్‌లో ఒక పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత మరో పార్టీ నుంచి పోటీ చేయడంపై రాజ్యాంగపరమైన నిషేధం లేదని వాదించారు. హైకోర్టు తనను అనర్హుడిగా ప్రకటించడం తప్పని, గతంలో బిహార్‌కు చెందిన మహాచంద్రప్రసాద్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా తీసుకుని స్పీకర్‌ ఆదేశాలను కొట్టేయడం పొరపాటని పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది.

ఈ తీర్పుతో ఖైరతాబాద్‌ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

Tags: